
సాక్షి, హైదరాబాద్: గన్ కల్చర్‌తో అమెరికాలో మరో ఘోరం చోటు చేసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి ఒకరు కన్నుమూశారు(Telangana Student Dies Dallas Gun Fire). ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు(Harish Rao) ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టుతో ధృవీకరించారు.
మృతుడు హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ పోలే(Chandrashekar Pole)గా తెలుస్తోంది. ఉన్నత విద్య కోసం అతను డల్లాస్‌కు వెళ్లినట్లు సమాచారం. చదువుకుంటూనే చంద్రశేఖర్.. స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం విధుల్లో ఉన్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడిగా సమాచారం. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించాల్సి ఉంది.
మరోవైపు.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది..
.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.
బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం.
ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025