
హైదరాబాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో గల హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ను కూడా పునరాభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 29.21 కోట్లు ఖర్చు చేస్తోంది.
హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంతో కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది . ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి పునరాభివృద్ధిలో ప్రాధాన్యతనిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్తు కూడా ఉన్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేషన్లలో నిర్మాణ పనులు చేపడుతున్నారు.


