ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి: రాములు నాయక్‌

Give Me Chance In MLC Elections Says EX MLA Leader Ramulu Nayak - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో కలిసి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గిరిజన నాయకుడిగా తనకు గుర్తింపు ఉందని, ఈ మూడు జిల్లాల్లో ఉన్న గిరిజన ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్‌ విజ్ఞప్తి చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top