
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా’ అంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులను బెదిరిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని శ్రీవెంకటేశ్వర కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్‌నెంబర్ 224/ఏ యజమాని రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపడుతుండగా సొసైటీ అధ్యక్షుడు అటు హైడ్రాకు, ఇటు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు శుక్రవారం ప్రహరీని పరిశీలించడానికి వచ్చారు.
అధికారులు సర్వే చేస్తున్న సమయంలో ఇంటి యజమానిగా చెప్పుకుంటున్న నూకారపు రామకృష్ణ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి చేరుకుని అధికారులపై దుర్బాషలాడారు. అంతుచూస్తానంటూ తన కారులో నుంచి కత్తి తీసి నరికేస్తానంటూ బెదిరించాడు. తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశాడు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిలింనగర్ పోలీసులు నిందితుడు నూకారపు రామకృష్ణపై బీఎన్‌ఎస్ సెక్షన్ 132, 351 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
నా జోలికి వస్తే నరికేస్తా
రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న అధికారులను కత్తితో బెదిరించిన వ్యక్తి
హైదరాబాద్ – బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్డు నంబర్ 12లోని రోడ్డు ఆక్రమించి ప్రహారీ గోడ కట్టిన వ్యక్తిని అడ్డుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
అడ్డుకున్న అధికారులను అడ్డంగా నరికేస్తా… pic.twitter.com/n1mzWsluJ2— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025