తెలంగాణ ఆచరిస్తోంది.. కేంద్రం అనుసరిస్తోంది: మంత్రి హరీశ్‌ 

FM Harish Rao TS Budget 2023-24 Speech In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు 2023-24 ఏడాదికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  మంత్రి హరీశ్‌ నాలుగోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. ఈ ఏడాదికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను రూ.2,90,396 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం 2,11,685, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లుగా కాగా.. తెలంగాణలో 2023-24కు తలసరి ఆదాయం రూ. 3లక్షల 17వేల 175గా ఉంది.  అనంతరం, మంత్రి బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపించారు. 

ఇక, బడ్జెట్‌ ప్రసంగం సందర్బంగా మంత్రి హరీశ్‌ కేంద్రంపై ఫైర్‌ అయ్యారు. కేంద్రం సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోంది. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన హామీలను కూడా పరిష్కరించలేదు. ట్రిబ్యునల్స్‌ పేరిట కేంద్రం దాటవేత ధోరణి పాటిస్తోంది. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. 

కేటాయింపులు ఇవే.. 
- నీటి పారుదల రంగానికి రూ. 26,885 కోట్లు
- విద్యుత్‌రంగానికి రూ. 12,727 కోట్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
- ఆయిల్‌ ఫామ్‌కు రూ. 100 కోట్లు 
- దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు 
- ఆసరా పెన్షన్‌కు రూ. 12వేల కోట్లు
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు 
- బీసీ సంక్షేమానికి రూ. 6,229కోట్లు 
- వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు

- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ. 3,210 కోట్లు. 
- పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ. 2500 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లు
- హోంశాఖకు రూ. 9599 కోట్లు
- మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2131 కోట్లు

- మైనార్టీ సంక్షేమానికి రూ.2200 కోట్లు
- రైతుబంధు పథకానికి రూ.1575కోట్లు
- రైతుబీమా పథకానికి రూ. 1589కోట్లు 
- కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకానికి రూ. 200కోట్లు
- పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4834 కోట్లు 

- విద్యారంగానికి రూ.19,093 కోట్లు
- హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.500కోట్లు
- పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీ రూ. 500కోట్లు 
- రైతు వేదికలకు రూ. 26,835 కోట్లు
- మహిళా వర్సిటీకి రూ. 100కోట్లు
- మూసీనది అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు.

- డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకానికి రూ.12వేల కోట్లు 
- ఆరోగ్యశ్రీకి రూ.1463 కోట్లు
- షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
- పంచాయతీరాజ్‌కు రూ. 31,426 కోట్లు

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top