మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య | Female BSF jawan commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

Sep 9 2024 9:26 AM | Updated on Sep 9 2024 9:26 AM

Female BSF jawan commits suicide

జ్యోతినగర్‌ (రామగుండం): పెద్దపల్లి జిల్లా ఎనీ్టపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బల్లా గంగాభవాని (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ దంతివాడలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. శనివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. గంగాభవాని విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఆమె నివాసం ఉండే గదికి చేరుకుని చూశారు. గది తలుపులు వేసి ఉండటంతో వాటిని పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకుని కనిపించారు. 

రామగుండం ఎన్టీపీసీ సుభాష్ గర్‌లో నివాసం ఉంటున్న బల్ల సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల కుమార్తె గంగాభవానికి 2021లో బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం లభించింది. తొలుత ఆమె పశి్చమబెంగాల్‌లో పనిచేశారు. ఇటీవల గుజరాత్‌లోని గాం«దీనగర్‌ దంతివాడకు బదిలీపై వెళ్లారు. గతనెల 5వ తేదీన నుంచి 24వ తేదీ వరకు సెలవుపై రామగుండం వచ్చిన గంగాభవాని.. ఈనెల రెండో తేదీన తిరిగి విధుల్లో చేరారు. 

అయితే, అక్కడ రోజూ 18 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఆరు గంటలే విశ్రాంతి ఉంటోందని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. ‘అమ్మా.. నాన్న.. ఈ ఉద్యోగం చేయలేను.. ఇక్కడ ఉండలేను’అని ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు తెలిసింది. దీంతో ఇబ్బందిగా ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలని చెప్పామని, ఇంతలోనే తమ కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. గంగాభవాని మృతదేహాన్ని ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి కుటుంబసభ్యులు స్వస్థలానికి తీసుకొచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement