దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో నరేంద్రకుమార్‌ | Dr Narendra Kumar In The List Of Best Doctors In Southern States | Sakshi
Sakshi News home page

దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో నరేంద్రకుమార్‌

Jul 5 2022 1:36 AM | Updated on Jul 5 2022 2:59 PM

Dr Narendra Kumar In The List Of Best Doctors In Southern States - Sakshi

వనపర్తి : మూడు దశాబ్దాలుగా పీడియాట్రిక్‌ సర్జన్‌గా వైద్యసేవలందిస్తున్న వనపర్తి జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌కు ఇండియాటుడే విడుదల చేసిన దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో స్థానం లభించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో ఆయనకు అభినందనలు తెలిపారు. 1991లో పిల్లల వైద్య నిపుణుడిగా వృత్తిలో చేరిన నరేంద్రకుమార్‌ వేలాది మంది చిన్నారులకు చికిత్స చేశారు.

హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో 22 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి, 30 వేల శస్త్రచికిత్సలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో ప్రభుత్వ వైద్యుడిగా తెలంగాణ నుంచి మొదటి స్థానం దక్కించుకున్న నరేంద్రకుమార్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా 
అభినందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement