ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్: సీపీ సజ్జనార్‌ | cp sajjanar salutes real heros | Sakshi
Sakshi News home page

ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్: సీపీ సజ్జనార్‌

Oct 14 2026 6:07 PM | Updated on Oct 14 2026 6:21 PM

cp sajjanar salutes real heros

హైదరాబాద్‌: ఓ చిన్నారిని కన్నతల్లే హుస్సేన్‌ సాగర్‌లోకి తోసి, చంపేయాలనుకుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ చిన్నారిని కాపాడారని చెప్పారు. వారిని సత్కరించిన నేపథ్యంలో సజ్జనార్‌ ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘కన్నతల్లే నిస్సహాయతతో హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టేసి మృత్యుఒడికి చేర్చాలని చూసిన వేళ.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌ను మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించాను.

ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం.

ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్! పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయాలు తీసుకోకండి. నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరండి. ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది. లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement