జగిత్యాలక్రైం: భార్య, ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని లాడ్జిలో ఉండగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కలకలం సృష్టించింది. సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు భర్త, కుమార్తె ఉండగా.. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయ్యే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో యువకుడిని మందలించినా మార్పు రాకపోవడంతో ఇటీవల దాడి చేశాడు. ఈ ఘటనలో జైలుకు వెళ్లి విడుదలై వచ్చాడు. ఈక్రమంలోనే భార్య, యువకుడిపై నిఘా పెట్టాడు. బుధవారం కొత్తబస్టాండ్ ప్రాంతంలోని ఓ లాడ్జిలోకి వెళ్లడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళతోపాటు యువకుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించి విచారణ చేపడుతున్నారు.


