బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు

Published Fri, Dec 1 2023 11:57 AM

Case Filed On Bellampally MLA Durgam Chinnaiah - Sakshi

సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన నేపథ్యంలో  బెల్లంపల్లిలోని నెన్నెల పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ సందర్భంగా ఓటు వేసేందుకు బీఆర్​ఎస్ ​కండువాతో ఎమ్మెల్యే పోలింగ్​ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్​లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దుర్గం చిన్నయ్య గులాబీ కండువాతో పోలింగ్​ కేంద్రానికి వచ్చినా ఎన్నికల సిబ్బంది   అడ్డుచెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రిసైడింగ్​ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement