రాజాసింగ్‌ అరెస్ట్‌ ఎఫెక్ట్‌.. అక్కడ షాపులు, పాఠశాలలు బంద్‌

Bhainsa Bandh To Protest The Arrest Of BJP MLA Raja Singh - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్లుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ  కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్‌ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్‌ తెలిపారు. 

ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్‌ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top