బీజేపీలోకి ‘బూర’తో  పాటు మరో ముగ్గురు? | Along with Boora Narsaiah Goud, three others will join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ‘బూర’తో  పాటు మరో ముగ్గురు?

Oct 19 2022 1:13 AM | Updated on Oct 19 2022 1:13 AM

Along with Boora Narsaiah Goud, three others will join BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో బుధవారం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో పాటు మరికొందరు ఆ  పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ (మాజీ ఎమ్మెల్యే నారాయణ్‌రావు సోదరుడు) కుమారుడు నరేశ్‌ ముదిరాజ్‌తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మరో నేత చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు హాజరు కానున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement