రెసిడెన్షియల్‌ కాలేజీలో 75 మందికి కరోనా

67 Students Test Covid-19 Positive At Korutla Womens Degree College - Sakshi

కోరుట్ల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో కలకలం 

67 మంది విద్యార్థినులు, 8 మంది అధ్యాపకులకు పాజిటివ్‌  

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 67 మంది విద్యార్థినులు కళాశాలలో కొత్తగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన వారే కావడం గమనార్హం. పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌లు రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ, సోషల్‌ వేల్పేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌ కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమ పిల్లలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. (టీకాకూ ఓ లెక్కుంది..)

కళాశాలలో 730 సీట్లు ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థినులు నెల రోజులుగా ఇక్కడ తరగతులకు హాజరవుతున్నారు. శనివారం ఈ కళాశాలలో వైద్యాధికారులు సుమారు 283 మంది విద్యార్థినులు, 12 మంది అధ్యాపకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 67 మంది విద్యార్థినులు, మరో 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో శ్రీధర్, కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌ల అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  (అందరికీ కరోనా వ్యాక్సిన్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top