ధోవతి ఫంక్షన్‌ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా

10 Members Tested Positive For Corona Who Attended A Function - Sakshi

ఒకరి పరిస్థితి విషమం

సాక్షి, నల్లగొండ రూరల్‌: శుభకార్యం ఓ కుటుం బాన్ని కుదిపేసింది. కరోనా మహమ్మారి ఒకరి తర్వాత ఒకరికి సోకి ఆర్థికంగా దెబ్బతీసింది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బచ్చన్నగూడేనికి చెందిన జానయ్య, లక్ష్మి దంపతులు ఇటీవల తమ కుమారుడు సాయికి ధోవతి ఫంక్షన్‌ నిర్వహించారు. శుభకార్యానికి నల్లగొండ మం డలం చెన్నుగూడేనికి చెందిన లక్ష్మి తల్లిదండ్రులు మర్రి జంగయ్య, అలివేలు దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

కాగా, ఫంక్షన్‌ ముగిసిన రెండు రోజులకు తొలుత జానయ్య, లక్ష్మి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత జంగయ్య, అలివేలుతో పాటు వీరి చిన్న కుమార్తె, పెద్దకుమారుడు సైదులు, అతడి భార్య, బంధువులు మొత్తంగా పదిమంది వైరస్‌ బారిన పడ్డారు. జానయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన తొమ్మిది మంది హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

చదవండి:ఐదు నిమిషాలు ఆలస్యం.. రూ.వెయ్యి ఫైన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top