కేటీఆర్‌ సార్‌.. మెట్రో మాక్కూడా!

Requests Pour To KTR Over Metro Extension - Sakshi

హైదరాబాద్‌:  నగరవాసుల ప్రయాణ బాధల్ని తీరుస్తూ.. లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్‌ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది ఇది. అయితే.. ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ చెంతకు క్యూ కడుతున్నారు. 

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు మెట్రో సర్వీస్‌ పొడిగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top