తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ తాలూకా మానాడు తండుపత్తు గ్రామంలో కూడంకుడి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్–2, 3 పనుల కోసం 9.3 హెక్టార్ల భూమిని, కోవిల్‌పట్టి తాలూకాలోని దోనుగాల్, నాలాట్టిన్‌పుధుర్ గ్రామాలలో ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు మొత్తం 2.98 హెక్టార్ల భూమి సేకరించనున్నారు.
కడలూరు జిల్లా ఎన్‌ఎల్‌సీ ఇండియా లిగ్నైట్ మైనింగ్ విస్తరణ పనుల కోసం వానతి రాయపురం, గంగైకొండన్ గ్రామాల్లో భూములు,. కడలూరు సిప్‌కాట్ పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం త్యాగవల్లి, కుడికాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ సేకరణ జరగనున్నది.
తిరువణ్ణామలై జిల్లా చెయ్యార్ తాలూకా మేల్మా గ్రామంలో సిప్‌కాట్ పారిశ్రామిక వాడ స్టేజ్–3 ఏర్పాటు కోసం 22.16 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు.
చైన్నె మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎగ్మోర్ తాలూకా పరిధిలో చేట్ పట్ మెట్రో రైలు స్టేషన్ నిర్మాణం కోసం 24 చదరపు మీటర్ల ఖాళీ స్థలాన్ని సేకరించనున్నారు.
కోయంబత్తూరు జిల్లా కిణత్తుకడవు తాలూకా కొడంగిపాళయం గ్రామంలో కొత్త సిప్‌కాట్ పారిశ్రామిక వాడ ఏర్పాటు నిమిత్తం 4.31 హెక్టార్ల భూమిని సేకించనున్నారు.
ఈ భూసేకరణకు సంబంధించి పూర్తి నష్టపరిహార మొత్తాన్ని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ , ఎనన్‌ఎల్‌సీ, చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్‌తో పాటుగా ఆయా సంస్థలే నేరుగా చెల్లిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భూసేకరణకు సంబంధించిన ప్రాజెక్ట్ మ్యాప్స్, పత్రాలను తూత్తుకుడి, కడలూరు, తిరువణ్ణామలై జిల్లాల జిల్లాల డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ (ల్యాండ్ అక్విజిషన్), స్పెషల్ తహసీల్దార్ కార్యాలయాలలో పని రోజులలో ప్రజలు నేరుగా పరిశీలించవచ్చు.
స్విట్జర్లాండ్ పర్యటనకు కసరత్తు
జనవరిలో ఉండే అవకాశం
సాక్షి, చైన్నె : చైన్నె మెట్రో రైలు, కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్ట్, ఎన్‌ఎల్‌సీ గనుల విస్తరణ, కడలూరు, చెయ్యార్ సిప్‌కాట్ పారిశ్రామిక వాడలు సహా తమిళనాడు వ్యాప్తంగా 7 కీలక ప్రాజెక్టుల కోసం భూములను సేకరించాలని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. సీఎం విజయ్ ఆదేశాల మేరకు ు భూపరిపాలనా కమిషనర్ రాజేష్ లఖాని గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
జనవరిలో సీఎం విజయ్ స్విట్జర్లాండ్ పర్యటన
సీఎం విజయ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా తమిళనాడులో పారిశ్రామిక పెట్టుబడులు, అభివృద్ధి కార్యకలాపాలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ వచ్చే ఏడాది జనవరి 18 నుండి 22 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ క్లోస్టర్స్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు పరిశ్రమలశాఖ మంత్రులు మాత్రమే హాజరయ్యేవారు. అయితే, తొలిసారిగా సీఎం స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరుకానుండటం రాజకీయంగా, పారిశ్రామిక వర్గాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక అభివృద్ధి కోసం రాజకీయ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగడానికి ఇది చక్కని వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థలు, విద్యావేత్తలు , మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, ప్రపంచ సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనడంపై ఈ వేదికపై విస్తృతంగా చర్చిస్తారు. ప్రపంచ దేశాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, తమిళనాడును గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందే పరిశ్రమలను ఆకర్షించేందుకు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుల వివరాలు..
అధికారులకు సీఎం విజయ్ ఆదేశాలు


