కొవ్వొత్తులతో మహిళల నిరసన | - | Sakshi
Sakshi News home page

కొవ్వొత్తులతో మహిళల నిరసన

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

● రాత్రి సమయంలో గస్తీని పెంచాలని మహిళల డిమాండ్‌

తిరువళ్లూరు: పూందమల్లి సమీపంలోని ఉత్తర భారతదేశానికి చెందిన వలస కార్మికులు ఎక్కువగా వున్న క్రమంలో కుత్తంబాక్కం, ఉట్‌కోటై, నేమం, పడూర్‌ తదితర గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా వీధి ధీపాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు కొవ్వొత్తులతో మంగళశారం రాత్రి నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి యూనియన్‌లోని కుత్తకంబాక్కం, ఇరుళపాళ్యం, ఉట్‌కోటై, నేమం, పడూర్‌ తదితర గ్రామాలు వున్నాయి. ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు వున్న క్రమంలో ఉత్తర భారతదేశానికి చెందిన వలస కార్మికులు పని చేస్తున్నారు. ఇటీవల గుమ్మిడిపూండిలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటననూ గుర్తు చేసిన మహిళలు, రాత్రి సమయంలో మెయిన్‌ రోడ్డు నుంచి గ్రామాలకు చీకటిలో వెళ్లాల్సి వుంది. వీధి ధీపాలను ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించడం లేదు. అధికారుల తీరును నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన చేస్తున్నట్టు వాపోయారు. అధికారులు ఇప్పటికై నా ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా వీధి ధీపాలను ఏర్పాటు చేయడంతో పాటూ రాత్రి సమయంలో పోలీసుల గస్తీని పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిస్కరించని పక్షంలో ఆందోళననూ ఉదృత చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement