●ఇంట్లోనే ప్రసవం, తల్లి, బిడ్డ మృతి
తిరువొత్తియూరు: కొండ దిగువ గ్రామంలో ఇంట్లోనే ప్రసవం జరగడంతో తల్లి, నవజాత శిశువు ఇద్దరూ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. ధర్మపురి జిల్లా అరూర్ కోట్టపట్టి సమీపంలోని మలైయడివార గ్రామంకు చెందిన వారు చెన్నకృష్ణన్ కూలీ. ఆయన భార్య పళనియమ్మాళ్ (38). వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో, తమకు మగ సంతానం కావాలని ఆ దంపతులు ఆశపడ్డారు. పళనియమ్మాళ్ నాలుగోసారి గర్భం దాల్చారు. నిండు గర్భిణిగా ఉన్న ఆమెకు శనివారం రాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. కొండ దిగువ గ్రామం కొండ ప్రాంతంలో ఉండటం వల్ల సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో స్థానిక మహిళలే ఆమెకు ప్రసవం చేశారు. ఆమెకు మళ్లీ ఆడపిల్ల పుట్టింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే ఆ ఆడశిశువు మరణించింది. మరోవైపు పళనియమ్మాళ్ కూడా స్పృహ కోల్పోయి మృతి చెందారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన చెన్నకృష్ణన్, కోట్టపట్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. ప్రభుత్వ వైద్యులు, నర్సులు అక్కడికి చేరుకుని పరీక్షించగా, పళనియమ్మాళ్ అప్పటికే మరణించినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులు వినూత్నంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ చైన్నెకి చెందిన న్యాయవాది సుందర వడివేల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచా రం చేస్తూ, రూ. 2,000, రూ. 10,000 విలువైన బ్యాంకు చెక్కుల తరహాలో ఉన్న నకిలీ కరపత్రాల ను ప్రజలకు పంపిణీ చేస్తున్నారని వివరించారు. అన్నాడీఎంకేకు ఓటు వేస్తే ఈ నగదు అందుతుందనే భ్రమను కల్పిస్తూ ఓటర్లను మోసం చేస్తున్నార ని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుటిల మార్గాల ద్వారా ఎన్నికల్లో ప్రభావం చూపడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అవినీతి కిందకు వస్తుందని, ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అన్నాడీఎంకే అభ్యర్థులు , పార్టీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని న్యాయవాది సుందర వడివేల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సాక్షి, చైన్నె: స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకే పరిమితం కాకుండా, దేశ మానవ వనరుల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించే విధంగా ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రోగ్రామ్‌ను శాంసంగ్ ఇండియా విజయవంతం చేసింది. దీని ద్వారా తమిళనాడులో 5,000 మంది యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. జాతీయ స్థాయిలో మహిళల భాగస్వామ్యం 48 శాతంగా ఉంటే, తమిళనాడులో అది అంతకంటే ఎక్కువగా ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనంగా శాంసంగ్ సౌత్ వెస్ట్ ఆసియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పి. చున్ తెలిపారు. ఆదివారం ఈ ఈ ప్రోగ్రామ్ కింద యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా ,కోడింగ్ ప్రోగ్రామింగ్‌లలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సామాజిక బాధ్యత ఖర్చుల కోసం ఖర్చును భారీగా పెంచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 144 కోట్లుగా ఉన్న నిధులను, 2025–26 నాటికి రూ. 193 కోట్లకు పెంచినట్టు వివరించారు.యువతలో సృజనాత్మకతను పెంపొందించి, వారు సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేయడమే తమ లక్ష్యం్ఙ అని పేర్కొన్నారు.


