
చారిత్రక కథా చిత్రంలో నటించాలనుంది
తమిళసినిమా: నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ గేమ్. సంతోష్ ప్రతాప్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కు రాజేశ్.ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ థ్రిల్లర్ కథాంశంతో కూడిన వెబ్ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ కలిసి నిర్మించాయి. క్రీడ అనేది కాలక్షేపానికి మాత్రమేననీ, అయితే అదే ప్రళయంగా మారితే అనే కథాంశంతో కూడిన ఈ వెబ్ సిరీస్‌ను అక్టోబర్ 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కథ థ్రిల్లర్ మాత్రమే కాదనీ జీవన ప్రపంచాన్ని ప్రతిబింబించే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఇందులో కుటుంబ అనుబంధాలతో పాటు వర్చువల్ ప్రపంచం చోటు చేసుకుంటాయన్నారు. వర్చువల్ ప్రపంచంగా మాత్రమే ఉండడం లేదనీ అది జీవితాలను టచ్ చేసినప్పుడు ఏర్పడే తీవ్ర పరిణామాలను కట్టడి చేయలేకపోతున్నామన్నారు. అలాంటి కథాంశంతో తెరకెక్కించిన వెబ్ చిత్రం గేమ్ అని చెప్పారు. ఇది తాను దర్శకత్వం వహించిన తొలి తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అని చెప్పారు. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారన్న ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ పేర్కొన్నారు.