ఘనంగా ఉదయనిధి పుట్టినరోజు వేడుకలు
పళ్లిపట్టు: ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జన్మదినం సందర్భంగా గురువారం డీఎంకే శ్రేణులు కోలాహలంగా పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కన్వీనర్ బీడీ చంద్రన్ ఆధ్వర్యంలో అత్తిమాంజేరిపేటలో ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మందికి మండల కన్వీనర్ బీడీ చంద్రన్, మాజీ కన్వీనర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి బిరియానీతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ మురళీసేన, మండల యువజన ఉప కార్యదదర్శి దేవరాజ్ సహా అనేక మంది పాల్గొన్నారు. తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట సహా పలు ప్రాంతాల్లో డీఎంకే శ్రేణులు, యువజన విభాగం కార్యకర్తలు ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడునలను కోలాహలంగా కొనియాడారు.


