ఆసియా బుక్‌లోకి ఈవీ
సాక్షి, చైన్నె: ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వాహనం కొత్త రికార్డులను నమోదు చేసింది. లేహ్ నుంచి కన్యాకుమారి వరకు 83 గంటలలో 3,757 కి.మీ దూరం ప్రయాణించిన ఎలక్ట్రిక్ వాహనంగా ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అత్యంత వేగవంతమైన, సురక్షిత ప్రయాణాన్ని ధ్రువీకరించే విధంగా సాగిన ఈ ప్రయాణంపై జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రధాన అధికారి వినయ్ రైనా స్థానికంగా గురువారం వివరిస్తూ లేహ్ నుంచి కన్యాకుమారి వరకు ఒక వైవిధ్యమైన సాహస యాత్రను ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగించి రికార్డు సృష్టించామన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, దానికి శక్తినిచ్చే మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న విశ్వాసానికి ఈ ధైర్యం నిదర్శనమని వ్యాఖ్యానించారు.


