ఆధునిక పద్ధతుల్లో కుటుంబం నియంత్రణ
తిరువళ్లూరు: పురుషులకు ఆధునిక పద్ధతుల్లో శాశ్వత కుటుంబ నియంత్రణ కల్పించే అంఽశంపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురుషులకు ఆధునిక పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ చేసే అంశంపై రెండు వారాలపాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయడానికి ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులకు ఆధునిక పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే అంశంపై నవంబర్ 21 నుంచి డిసెంబర్ నాలుగు వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై ఆసక్తి ఉన్నవారు సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించవచ్చని కూడా ఆయన వివరించారు. ఆపరేషన్ చేసుకునే వారికి ప్రభుత్వం ఐదువేల రూపాయల మేరకు ప్రోత్సాహకం అందజేస్తుందని కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


