
మరమ్మతు పనులు ఆపండి
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కోరంతాంగల్ గ్రామం వద్ద రైల్వే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కింద వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఇకపై ఈ రైలు మార్గంలో రైలు అతివేగంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తనిఖీలు చేసి రైల్వే బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేసేందుకు కార్మికులు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బ్రిడ్జి కింద ఎటువంటి పనులు చేపట్టకూడదని కార్మికులను అడ్డుకున్నారు. బ్రిడ్జి కింద వాహనాలు వచ్చి వెళ్లేలా ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పనులు మొదలెట్టాలని తేల్చి చెప్పడంతో అఽధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింప జేశారు. అనంతరం అధికారులతో పోలీసులు చర్చించి వాహన రాక పోకలకు దారి ఏర్పాటు చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు.