
‘ఐరిస్ ఫేస్ ఆఫ్ చైన్నె’కు సన్నద్ధం
సాక్షి, చైన్నె: యువ మోడల్స్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చే ఐరిస్ ఫేస్ ఆఫ్ చైన్నెకు నేచురల్స్ సన్నద్ధమైంది. ఈ ఏడాది 25వ సంవత్సరం(సిల్వర్ జూబ్లీ) వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా లాంచ్ ఫ్యాడ్, విజేతకు బహూకరించే కిరిటాన్ని స్థానికంగా బుధవారం ప్రదర్శించారు. నేచురల్స్ సెలూన్ సహ వ్యవస్థాపకుడు సికే కుమర వేల్, వ్యవస్థాపకురాలు డాక్టర్ వీనా కుమర వేల్, జీఆర్‌టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోటా, సుల్తాన్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఎండీ సుల్తాన్ మొహిద్దీన్,డఫిల్ డిజిటల్ వ్యవస్థాపకుడు ఏఎస్ మురుగ వేలన్, ఐరిస్ సీఈఓ డాక్టర్ లత ఏ కృష్ణలు ఈ వేడుకల వివరాలను వెల్లడించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేకంగా మధురై, తిరుచ్చి, కోయంబత్తూరుతో పాటూ చైన్నె వంటి నగరాలలో ఆడిషన్లు నిర్వహించనున్నామని ప్రకటించారు. 18 నుంచి 29 సంవత్సరాల యువ మోడల్స్‌కు మిస్ అండ్ మిస్టర్ పోటీలు, 50 ఏళ్ల వయసున్న వివాహిత మహిళల కోసం ప్రత్యేక పోటీ నిర్వహించనున్నామని వివరించారు. సెప్టెంబరు నెలలో మెగా ఆడిషన్ జరుగుతుందన్నారు. ఆ తదుపరి అన్ని విభాగాలలో ఫైనలిస్టులను ఎంపిక ఉంటుందని, సెప్టెంబరు 27వ తేదీన మీనంబాక్కంలో ఫినాలే జీఆర్‌టీ రాడిషన్ బ్లూలో నిర్వహించనున్నామని ప్రకటించారు. గత సంవత్సరంలో చైన్నెలో జరిగిన ఆడిషన్‌కు 1000 మంది హాజరయ్యారని, మూడు విభాగాలలో 30 మంది ఫైనల్‌కు చేరుకున్నారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం తమిళనాడు వ్యాప్తంగా ఆడిషన్లకు 3 వేల మందికి పైగా హాజరు అవుతారని భావిస్తున్నామన్నారు. వీరిలో ప్రతి విభాగం నుంచి 15 మందిని ఫైనల్‌కు షార్ట్ లిస్ట్ చేయనున్నామని వివరించారు.