
రాష్ట్ర ప్రజలంతా.. మనతోనే!
ప్రజలు మనతోనే ఉన్నారని, 2026లో చరిత్ర సృష్టించే విజయాన్ని నమోదు చేయబోతున్నామని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. 1967, 1977 ఎన్నికలలో సాగిన ప్రజా ప్రభంజనం 2026లో పునరావృతం కావడం తథ్యమన్నారు. ఈ మేరకు బుధవారం చైన్నెలో జిల్లాల కార్యదర్శుల భేటీలో విజయ్ ప్రసంగించారు.
సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. ఆగస్టులో జరిగే మధురై మహానాడు తదుపరి ఆయన ప్రజా క్షేత్రంలో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాల కార్యదర్శులతో బుధవారం చైన్నెలో భేటీ అయ్యారు. ఇది వరకు జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నిర్వాహకులతో తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరచూ సమావేశాలు నిర్వహిస్తుండే వారు. అయితే, ఈ సారి విజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాల కార్యదర్శులతో సుదీర్ఘంగా ఆయన సమావేశమయేయవారు.
జిల్లాల కార్యదర్శులతో భేటీ..
చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లాల కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ ముఖ్య నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులతో కలిసి పార్టీ పరంగా ఉన్న 120 జిల్లాలకు చెందిన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో మధురై మహానాడు విజయవంతం దిశగా చర్చించారు. ఈ మహానాడు ద్వారా దక్షిణ తమిళనాడులో తమకు ఉన్న బలాన్ని చాటే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే విజయ్ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లే రీతిలో రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ప్రజా పయనం పేరిట విజయ్ యాత్ర సాగే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎక్కడి నుంచి ఈ ప్రయాణం మొదలెట్టాలో అన్న విషయంగా చర్చించడమే కాకుండా, వినూత్న రీతిలో ప్రజలతో ఇంటింటా మమేకం అయ్యే విధంగా కార్యక్రమాల రూపకల్పనకు గురించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు అన్నది రాకుండా నిర్వాహకులు వ్యవహరించాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా కార్యక్రమాలు ఉండాలే గానీ, అసహించుకునే రీతిలో ఉండ కూడదన్న హెచ్చరికలు విజయ్‌చేసినట్టు సమాచారం.
అన్నా మార్గంలో..
విజయ్ ప్రసంగిస్తూ, నేతల నుంచి వచ్చిన ఐలవ్‌యూ అన్న పిలుపుకు ప్రతి స్పందనగా ఐలవ్ యూ టూ అని సమాధానం ఇస్తూ వ్యాఖ్యలను అందుకున్నారు. తమిళనాడు చరిత్రలో రెండు అతిపెద్ద ఎన్నికలు గతంలో జరిగాయని వివరించారు. ఆ ఎన్నికలు 1967, 1977లో జరిగినవిగా గుర్తు చేస్తూ, ఈ విజయోత్సవం 2026లో పునరావృతం కానున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర సృష్టించే విధంగా జరిగిన ఆ ఎన్నికల విజయ పరంపర టీవీకే గెలుపుతో ప్రజా ప్రబంజనం సృష్టించనున్నదన్నారు. అధికారం, ధన బలానికి వ్యతిరేకంగా ఆ ఎన్నికలలో పోటీ చేసిన వాళ్లు విజయ ఢంకా మోగించారని వివరించారు. దీనిని సాధించేందుకుగతంలో వలే తాజాగా ఊరుకు...ఊరు, వీధికి...వీధి, ఇంటికి...వెవళ్లి అందర్నీ కలుద్దామని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తనకు అన్నా చెప్పిన విషయం గుర్తుకు వస్తున్నట్టు వివరించారు. ప్రజల వద్దకు వెళ్లు... ప్రజల నుంచి నేర్చుకో... , ప్రజలతో జీవించు...., ప్రజలతో కలిసి వ్యూహత్మకంగా అడుగులు వెయ్ ..అన్న ఆ వ్యాఖ్యలను మదిలో పెట్టుకుని ముందుకు సాగితే...ఇక, విజయోత్సవ ర్యాలీ తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కుటుంబాలను ఒకే వేదిక మీదకు సభ్యులుగా తీసుకొచ్చేందుకే ఈ మై టీవీకే యాప్ అని ప్రకటించారు. ఈ కార్యమ్రం తదుపరి మధురై మహానాడులో కలుద్దాం అని వ్యాఖ్యలు చేశారు. తదుపరి ప్రజాక్షేత్రంలోకి పయనం.. ప్రజలతో ...ప్రజల్లో ఉంటా... అన్ని పనులూ చేపట్టండి అని నేతలకు సూచించారు. ప్రజలకు మనం ఉన్నాం.. ప్రజలంతా మన వెన్నంటే. ఇంత కన్నా ఏం కావాలని అంతా మంచే జరుగుతుంది..గెలుపు తథ్యం అంటూ ప్రసంగాన్ని విజయ్ ముగించారు.
మై టీవీకే యాప్..
2026 ఎన్నికల్లో గెలుపు తథ్యం
అన్నాదురై మార్గంలో పయనిద్దాం
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వ్యాఖ్య
మై టీవీకే యాప్ ఆవిష్కరణ
పార్టీ ఆవిర్భావంతో సభ్యత్వ నమోదు ప్రక్రియపై విజయ్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఇందుకోసం ప్రకటించిన యాప్ ద్వారా ఉత్సాహంగా యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా సభ్యత్వ నమోదును పూర్తిస్థాయిలో నిబద్దతతో చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం మై టీవీకే పేరిట యాప్‌ను సిద్ధం చేశారు. ఈ యాప్‌ను జిల్లాల కార్యదర్శుల సమావేశంలో విజయ్ ఆవిష్కరించారు. అలాగే టీవీకే ఫ్యామిలీ వెబ్‌సైట్‌ను పరిచయం చేశారు. ఈయాప్ డౌన్‌లోడ్ చేసుకుని, తద్వారా పార్టీలో సభ్యులుగా చేరదలచని వారి వివరాలను నమోదు చేయించే రీతిలో ఇంటింటా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ మాట్లాడుతూ టీవీకేలో 2 లక్షల 95 వేల 970 మందికి పార్టీ పరంగా వివిధ పదవులు అప్పగించామని వివరించారు. అట్టడుగు వర్గాల ప్రజలే పార్టీకి వెన్నుముక అని, పార్టీ సభ్యత్వ నమోదు కొత్త ప్రతిభ, శక్తి, ఆలోచనలకు ప్రతిరూపం కానున్నట్టు ప్రకటించారు. పార్టీ నేత ఆదవ్ అర్జున మాట్లాడుతూ ఇక, అధినేత విజయ్ నేరుగా కేడర్‌తో మాట్లాడుతారని ప్రకటించారు. రెండు కోట్ల మంది సభ్యులను చేర్చడమే లక్ష్యంగా ముందుకెళ్దామని పిలుపు నిచ్చారు. బూత్ కమిటీలే కాదు నిర్వాహకులు పనితీరును విజయ్ ప్రత్యక్షంగా పరిశీలించడమే కాదు, అవసరం అయితే, ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయన్నారు.

రాష్ట్ర ప్రజలంతా.. మనతోనే!

రాష్ట్ర ప్రజలంతా.. మనతోనే!