
ఆవిష్కరణలకు తొలి ప్రాధాన్యత
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఆవిష్కరణ, మేధో సంపత్తికి తొలి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రకటించారు. టెక్నాలజీ ఎగ్జిబిషన్ హాల్ ప్రదర్శనలో పేటెంట్ పొందిన ట్రాన్స్ సెండెంటల్ టెక్నాలజీ ఆవిష్కరణలను బుధవారం ఆయన నపరిశీలించారు. తమిళనాడు ప్రభుత్వ సమాచార. సాంకేతిక పరిజ్ఞానం , డిజిటల్ మంత్రిత్వ శాఖ సేవల విభాగం పరిధిలోని తమిళనాడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం వేదికగా మేథో శక్తి కేంద్రం– తమిళనాడు, భారత దేశం అన్న అంశంతో ఆవిష్కరణ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిశీలించారు. ఇక్కడి ఆవిష్కరణలను, పేటెంట్లు పొందిన వివిధ పరిశోధనలను విష్కరించారు. తమిళనాడును ఆవిష్కరణలకు రాజధానిగా తీర్చిదిద్దుదామని ఈసందర్భంగా ప్రకటించారు. ఈ సదస్సులో
తమిళనాడు నుంచి 16 మంది పరిశోధకుల పేటెంట్లు, ఆవిష్కరణలకు సత్కారం, నగదు ప్రోత్సాహం అందించారు. 5 స్వదేశీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు, టెక్నాలజీ ఇన్నోవేషన్ కంపెనీలకు ఐడీఎన్‌టీ సెంటర్‌ఫౌండేషన్ ద్వారా రూ. 53 లక్షలను చెక్కులను అందజేశారు. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్ నేతృత్వంలో విద్యా పరిశోధకుల ఆవిష్కరణలకు, పేటెంట్ పొందిన కంపెనీలు, విద్యా పరిశోధకుల ఉపయోగం కోసం పారిశ్రామిక సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఐడీటీఎన్ సెంటర్‌కు మద్దతు ఇచ్చే విధంగా డీప్ లెర్నింగ్ టెక్నాలజీ , అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ స్టార్టప్‌లకు మద్దతుగా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఇండియా, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ హై–స్పీడ్ కంప్యూటింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మహీంద్రా – మహీంద్రా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఆరు సంస్థలో కూడిన కూడిన ఇంజినీరింగ్ సౌకర్యాల మ్యాప్( ఐ అండ్‌ఎస్‌టీఈఎం)ముందుకు వచ్చాయి. తమిళనాడు అంతటా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు, వ్యాపార ఇంక్యుబేటర్లు, స్టార్టప్ కంపెనీలు, పారిశ్రామిక కంపెనీలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన సాంకేతిక పరిశోధకులు, పేటెంట్ హోల్డర్లు ఈ సమావేశానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార సాంకేతిక , డిజిటల్ శాఖ మంత్రి డాక్టర్ పళణి వేల్ త్యాగరాజన్, రాష్ట్ర ప్రణాళికా కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ జె. జయరంజన్, టెక్నాలజీ, డిజిటల్ సేవల విభాగం ప్రభుత్వ ప్రాథమిక కార్యదర్శి ప్రజేంద్ర నవ్‌నిత్, ఐడిఎన్‌టి సెంటర్ చైర్మన్ వనితా వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ, తమిళనాడు పరిశ్రమలకు రాజధానిగా మారుతున్నట్టు వివరించారు. పెట్టుబడులు విస్తృతంగా రానున్నాయని వివరించారు. ఉద్యోగ అవకాశాల కల్పన విస్తృతం చేశామన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలకు తమిళనాడులో తొలి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు.
డిప్యూటీ సీఎం ఉదయ నిధి వెల్లడి

ఆవిష్కరణలకు తొలి ప్రాధాన్యత