
కోలాహలం..అగ్నిగుండ ప్రవేశం
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో ఆడిపుర బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి పది రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం స్వామివారికి తీర్థవారి నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో పరాశక్తి అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ఉన్నామలై అమ్మన్‌ను సన్నధి వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. అనంతరం ఉపవాసంతో ఉన్న భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. భక్తులు హరోంహరా నామస్మరణలతో ఆలయ ప్రాంగనం మారుమోగింది. అనంతరం ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిగుండ ప్రవేశ అనంతరం అమ్మవారికి గాజులు వేసే కార్యక్రమాన్ని మహిళా భక్తులచే నిర్వహించి ఆలయంలో ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు చేశారు.

కోలాహలం..అగ్నిగుండ ప్రవేశం