తమిళసినిమా: విజయాల మీద విజయాలు అందుకుంటున్న నేషనల్ క్రష్ నటి రష్మిక మందన్న. మాతృభాష అయిన కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయమైన బ్యూటీ ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె తెలుగులో అల్లు అర్జున్ ఫ్యాషన్ నటించిన పుష్ప– 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో అందం, అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా హిందీలో గుడ్ బై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, అక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకుంటున్నారు. ఆ తర్వాత నటించిన యానిమల్ చిత్రం ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్‌గా మార్చింది. తాజాగా ఛావా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చి సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో నటి రష్మిక మహారాణి పాత్రలో తన సత్తాను చాటారు. ఈ సందర్భంగా నేషనల్ క్రష్ వంటి పట్టంలు జీవితంలో ఏ విధంగానూ ఉపకరించవని పేర్కొన్నారు. దీని గురించి రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ సినిమాల్లో లభించే పట్టంలు, పేర్లు జీవితంలో ఉపయోగపడం లేదన్నారు. అలాంటివి అభిమానుల ఆదరాభిమానాలతో వచ్చేవి అన్నారు. అందుకే అవి పేర్లు మాత్రమేనని పేర్కొన్నారు. అయితే తన మంచిని కోరేవారిని తాను గుండెల్లో పెట్టుకున్నారని, వారిని నమ్మే చిత్రాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభిమానుల ప్రేమనే ప్రధానంగా భావిస్తానన్నారు. వారి కోసం ఏం చేయడానికై నా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది చిత్రాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రమగా మారిందన్నారు. అదే సమయంలో అభిమానుల ప్రేమ కోసం తాను తన నిద్రకే గుడ్ బై చెబుతున్నానని నటి రష్మిక మందన్న పేర్కొన్నారు.