మిల్లర్ల ఆటకు అడ్డుకట్ట! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల ఆటకు అడ్డుకట్ట!

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

తేడాలు కనిపిస్తే..

భానుపురి (సూర్యాపేట) : రైస్‌మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల మాయాజాలానికి ఇక బ్రేక్‌ పడనుంది. ధాన్యం కేటాయింపు నుంచి మిల్లింగ్‌, బియ్యం నిల్వలు, సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) సరఫరా వరకు ప్రతి దశను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ (పీవీ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు సీఎంఆర్‌ ధాన్యాన్ని తీసుకొని, బదులుగా ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ధాన్యం బకాయిలు వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా క్షేత్రస్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

పీవీ యాప్‌తో ఆకస్మిక తనిఖీలు

గతంలో మిల్లుల్లో తనిఖీలకు వెళ్లే విషయం ముందుగానే లీకయ్యే అవకాశం ఉండడంతో, మిల్లర్లు అప్రమత్తమై నిల్వలను సర్దుబాటు చేసుకునేవారనే విమర్శలు ఉండేవి. కొత్త విధానంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ర్యాండమైజేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏ మిల్లును ఏ అధికారి తనిఖీ చేయాలన్నది ముందుగా నిర్ణయించకుండా యాప్‌ ద్వారానే కేటాయిస్తారు. తనిఖీకి వెళ్లే అధికారికి సైతం ఆ మిల్లు వివరాలు సుమారు 12 గంటల ముందు మాత్రమే ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందనున్నాయి. మిల్లుకు కేటాయింపులు చేసిన ధాన్యం నుంచి ఇప్పటివరకు ఎంత సీఎంఆర్‌ తిరిగి అప్పగించారనే పూర్తి వివరాలు ఈ యాప్‌లోనే ఉంటాయి. క్షేత్రస్థాయికి వెళ్లే అధికారులు యాప్‌లోని వివరాలను, మిల్లులోని వాస్తవ నిల్వలతో పోల్చి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే అధికారులకు శిక్షణ

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను నష్టం లేకుండా రాబట్టే విధానంపై ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్లకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లా నుంచి ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు ఈ శిక్షణకు హాజరుకాగా, త్వరలోనే అసిస్టెంట్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఫ ధాన్యం నిల్వల

సర్దుబాటుకు ఇక ఛాన్స్‌ లేదు

ఫ ధాన్యం నుంచి సీఎంఆర్‌ దాకా.. డిజిటల్‌ నిఘా

ఫ అందుబాటులోకి

‘ఫిజికల్‌ వెరిఫికేషన్‌’ యాప్‌

ఫ డిఫాల్టర్ల ఆస్తుల జప్తునకు

రంగం సిద్ధం

తనిఖీల్లో రైస్‌మిల్లుల వద్ద ఉండాల్సిన ధాన్యం, బియ్యం నిల్వల్లో లోటు కనిపిస్తే వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నారు. ఏడు రోజుల గడువులోగా వివరణ ఇవ్వాల్సి ఉండగా.. సరైన సమాధానం ఇవ్వకపోయినా, బకాయిలు చెల్లించకపోయినా తదుపరి దశలో రెవెన్యూ రికవరీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నారు. బకాయిలు చెల్లించని మిల్లర్ల యంత్రాలు, వాహనాలు, ఇతర చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను జప్తు చేయనున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం పూర్తిస్థాయిలో పూడకపోతే, మిల్లర్ల భూములు, ఇళ్లు వంటి స్థిరాస్తులను సైతం జప్తు చేసి బహిరంగ వేలం ద్వారా బకాయిలు రాబట్టాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement