రక్త పరీక్షలను మరింత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షలను మరింత పెంచాలి

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సూర్యాపేట (భానుపురి) : తల్లులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వారికి అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌పవార్‌ అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో) డైరెక్టర్‌ జనరల్‌, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేష్‌ గుప్తా అన్ని జిల్లాల కలెక్టర్లతో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణకు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌పవార్‌ హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తూ, రక్త పరీక్షల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ప్రజల్లో రక్తదానం, రక్త పరీక్షల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారికి సకాలంలో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ప్రోగ్రామింగ్‌ అధికారి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

నేడు, రేపు ఓటరు నమోదు క్యాంపు

సూర్యాపేట (భానుపురి) :అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈనెల 15, 16వ తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ బుధవారం తెలిపారు. ఇటీవల ప్రచురించిన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, నూతనంగా ఓటు హక్కు పొందబోయే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపు రోజుల్లో ఉదయం నుంచే సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్‌ కేంద్రాల్లో స్థానికంగా అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement