కలెక్టర్‌కు ఎస్పీ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు ఎస్పీ అభినందనలు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సూర్యాపేట (సూర్యాపేటటౌన్‌) : సమాచార హక్కు చట్టం అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతులమీదుగా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ అవార్డు అందుకున్నారు. సందర్భంగా కలెక్టర్‌ను బుధవారం ఆయన కార్యాలయంలో ఎస్పీ నరసింహ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఐటీఐ, ఏటీసీలో

వాక్‌ఇన్‌ అడ్మిషన్లు

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గురువారం 5వ విడత వాక్‌ఇన్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నేరుగా హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా www.iti.telanga na.gov.in వెబ్‌సైట్‌లో తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లలో ఆన్‌లైన్‌లో లేదా తమ కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్‌ కోసం వచ్చే అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు (ఎస్‌ఎస్‌సీ మెమో, 1 నుంచి 10 వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, క్యాస్ట్‌, టీసీ, ఆధార్‌ కార్డు, పాస్‌ ఫొటోలు 3) రెండు సెట్ల జీరాక్స్‌ కాపీలు తీసుకురావాలని వివరించారు. మరిన్ని వివరాలకు 82475 06920, 91602 84139, 84990 84414 నంబర్లను సంప్రదించాలని కోరారు.

అర్హులందరికీ

చేయూత పింఛన్లు

సూర్యాపేట (పెన్‌పహాడ్‌): అర్హులందరికీ చేయూత పింఛన్లు అందుతాయని డీఆర్‌డీఓ సన్యాసయ్య అన్నారు. బుధవారం పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని ధర్మాపురం, మహ్మదాపురం, రంగయ్యగూడెం, భక్తాళాపురం, గాజులమల్కాపురం, చినసీతారాంతండా, చెట్లముకుందాపురం, తంగెళ్లగూడెం గ్రామాల్లో చేయూత పింఛన్ల దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ రాజేశ్వర్‌, ఏపీఎం అంజయ్య, ఏపీఓ రవి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement