నీటిని పొదుపుగా వాడుదాం | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వాడుదాం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సూర్యాపేట అర్బన్‌: ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గుతుండడంతో పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణపై మున్సిపాలిటీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అధికారులు నీటి వృథాను అరికట్టే చర్యలను ప్రారంభించారు. సూర్యాపేట, హుజూర్‌నగర్‌, కోదాడ, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ఇప్పటికే అక్కడక్కడ తాగునీటి సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం కొంతమేర నీటి సరఫరా అవుతుండడంతో అది తీవ్రంగా కనిపించడం లేదు. మున్ముందు ఇబ్బందులు తీవ్రమయ్యే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో సరఫరా చేస్తున్న తాగునీటిలో గణనీయమైన భాగం వినియోగానికంటే ముందే వృథా అవుతుంది. ఈ వృథాను అరికడితే దాదాపు సగభాగం నీటిని ఆదా చేసినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.

లీకేజీలపై ప్రత్యేక దృష్టి

ఇళ్ల ముందు వీధుల్లో ఏర్పాటు చేసిన నల్లాల పరిస్థితిపై సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వార్డు పరిధిలో లీకేజీలను గుర్తించి మరమ్మతు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపాలిటీల్లో నల్లాలకు బిరడాలు లేకుండా ఉన్న వాటిని గుర్తించి అమరుస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో నుంచి ట్యాంకులు నిండిన వెంటనే మోటార్లు ఆఫ్‌ చేయడం, అవసరం లేని సమయంలో నల్లాను బంద్‌ చేయాలని, వృథా నీటిని ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేసవి తీవ్ర రూపం దాల్చేలోపే నీటి వృథాను అరికడితే తాగునీటి ఇబ్బందులను కొంతవరకు అధిగమించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫ మున్సిపాలిటీలో నీటి సరఫరాపై

ప్రత్యేక దృష్టి

ఫ నీటి వృథా, లీకేజీలను గుర్తించి

సరిచేస్తున్న అధికారులు

మున్సిపాలిటీల్లో నల్లా కనెక్షన్లు

సూర్యాపేట 26,500

కోదాడ 9,749

హుజూర్‌నగర్‌ 6,200

నేరేడుచర్ల 2,446

తిరుమలగిరి 4,350

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement