ఆదాయమున్నా.. వసతులు లేవు | - | Sakshi
Sakshi News home page

ఆదాయమున్నా.. వసతులు లేవు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సౌకర్యాలు కల్పించాలి

ఫ కోదాడ సంతలో కనిపించని

కనీస సౌకర్యాలు

ఫ తాగునీరు లేదు.. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ అధ్వానం

కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో కనీస వసతులు కరువయ్యాయి. ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే పశువుల సంతకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు, వ్యాపారులు వస్తుంటారు. కానీ వారికి కనీసం తాగడానికి మంచినీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ మరీ అధ్వానంగా తయారైంది.

కొనుగోళ్లు శూన్యం

కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గింజ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయరు. ఇది కేవలం పశువుల సంతగా మారిపోయింది. ప్రతి ఆదివారం జరిగే ఈ సంతకు పాడి, వ్యవసాయ పశువులతో పాటు మేకలు, గొర్రెలను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారు సేదతీరడానికి కనీస వసతి లేదు. గతంలో ఉన్న రైతు విశ్రాంతి భవనాన్ని వ్యవసాయ శాఖకు ఇవ్వగా, అది కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో ఖాళీ చేసి వెళ్లారు. దీంతో ఎండలో ఎండుతూ, వానకు తడుస్తూ వ్యాపారం చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి రహదారి పన్నుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, సౌకర్యాలను మాత్రం విస్మరించారు. తాగడానికి ఒకేఒక మంచినీటి నల్లాను ఏర్పాటు చేయగా, అక్కడ నిలబడి నీరు తాగడం కూడా కష్టంగా మారింది.

కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా..

వ్యవసాయ మార్కెట్‌కు ప్రతి ఏటా సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల ఆదాయం వస్తుంది. మార్కెట్‌ నిర్వహణకు 15 మందితో కూడిన పాలకవర్గం కూడా ఉంది. విశాలమైన ఆవరణ, గోదాములు, ధాన్యం కొనుగోలు షెడ్లు అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు, పాలకవర్గంలో చిత్తశుద్ధి లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

కోదాడ వ్యవసాయ మార్కెట్‌ను రైతులకు ఉపయోగపడే విధంగా పాలకవర్గం చర్యలు తీసుకోవాలి. సంతకు వచ్చే రైతులకు, వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలి. మార్కెట్‌ ఆదాయంతో గ్రామీణ లింక్‌రోడ్లకు మరమ్మతులు చేయించాలి.

– వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, రైతు, గుడిబండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement