సూర్యాపేట జిల్లా అయిన తర్వాత జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయి. స్టేడియాలు, గురుకులాలు ఇంకా పట్టణ ప్రజలకు పార్కులు ఉండాల్సిన స్థాయిలో లేవు. కవులు, కళాకారులకు ఒక వేదికగా ఉండాల్సిన మినీ రవీంద్ర భారతి వంటి కమ్యూనిటీ హాల్ ఒక కలగానే మిగిలిపోయింది.
– పెద్దిరెడ్డి గణేష్, బ్యాంకింగ్ రంగనిపుణుడు
పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రజలకు అధికారులు అందుబాటులోకి వస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అతి సా ధ్యమైంది. ఉన్నతాధికారులకు సామాన్యులు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వీ లుపడుతుంది. చిన్న జిల్లాలు కావడంతో ఉన్నతాధికారులకు జిల్లాలోని అన్ని ప్రాంతాలపై అవగాహన ఏర్పడుతుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడం కొంత లోటు కనిపిస్తుంది.
– బడుగుల సైదులు, సామాజిక విశ్లేషకుడు


