కొత్త జిల్లా ఏర్పాటుతోనే పాలన చేరువ | - | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లా ఏర్పాటుతోనే పాలన చేరువ

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

ఒక్కేసి పువ్వేసి చందమామ

ఓపెన్‌ యూనివర్సిటీ

అడ్మిషన్ల గడువు పెంపు

సూర్యాపేటటౌన్‌ : డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు ఈనెల 13వ తేదీ వరకు పొడిగించినట్టు విద్యార్థి సేవ విభాగం డైరెక్టర్‌, డాక్టర్‌ వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేషులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎం కామ్‌ విభా గాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌ : 9440194909, 8106089325, 9441561429 నంబర్లను కానీ నేరుగు కళాశాలలోని సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు శనివారం జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి. జిల్లా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు నియోజకవర్గాల నుంచి హాజరైన ఆ పార్టీ కార్యకర్తలు, యువత సద్దుల చెరువు నుంచి కొత్త బస్టాండ్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర 2కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గాదరి కిషోర్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జెడ్పీమాజీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వె.వి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటనారాయణగౌడ్‌, నంద్యాల దయాకర్‌రెడ్డి, యుగేందర్‌రావు, నాగార్జున, గండూరి ప్రకాష్‌, అన్నపూర్ణ, ఆకుల లవకుశ తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌,

బొల్లం మల్లయ్య యాదవ్‌

ఫ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌

ఆధ్వర్యంలో 2కే రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement