దేవీ శరన్నవరాత్రి శోభ
దేవీ శరన్నవరాత్రోత్సవాల నిర్వహణకు దేవస్థానాలు, పల్లెలు, పట్టణాల్లోని మండపాలు ముస్తాబయ్యాయి.
మట్టపల్లిలో పవిత్రారోపణం
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం పవిత్రారోపణం నిర్వహించారు.
- IIలో
పాలనా సౌలభ్యానికి..
సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడమే కాక ప్రజల ఆకాంక్ష మేరకు 18 మండలాలుగా ఏర్పడిన జిల్లాలో పాలన సౌలభ్యం కోసం మద్దిరాల, నాగారం, చింతలపాలెం, పాలకవీడు, అనంతగిరి కొత్త మండలాలు ఆవిర్భవించాయి. మొత్తం 23 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్‌లు, 323 గ్రామం పంచాయతీలతో ఏర్పడిన జిల్లా 2018లో తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల సంఖ్య 475కు చేరింది. అనంతరం మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలయ్యాయి.
జిల్లా ఏర్పడిన సమయంలో ఉన్న విద్యా వ్యవస్థకు, నేటి పరిస్థితులకు మధ్య చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారు. మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాలతో ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. జిల్లాలో మొత్తం 1,210 పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు 1.24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత విద్య, వృత్తి విద్య, వైద్య విద్య వంటి రంగాల్లో అవకాశాలను విస్తరించడం జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి కీలకం కానుంది. అలాగే నవోదయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను జిల్లాకు వచ్చాయి.
దశాబ్ద కాలం.. మారిన స్వరూపం
ఫ మైలురాళ్లుగా కలెక్టరేట్,
మెడికల్ కళాశాల నిర్మాణం
ఫ వైద్య విద్యకు ఊతం..
సాగులో ముందంజ
ఫ కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు
ఫ జిల్లా ఏర్పడి నేటితో పది వసంతాలు


