సూర్యాపేటటౌన్ : కేసుల దర్యాప్తును ప్రణాళికాబద్ధంగా చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కె.నరసింహ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ల రైటర్లు పాల్గొన్నారు.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల నిబంధనలు ప్రకారం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కె.నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండపాల వివరాలు, నిమజ్జనం తేదీ, వెళ్లే మార్గం వివరాలను పోలీసులకు తెలియజేయాలని, నిర్వాహకులు పోలీస్ సిబ్బంది ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.


