సర్‌ను రద్దుచేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ను రద్దుచేయాలి

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

సూర్యాపేట అర్బన్‌ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్‌)ను రద్దుచేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్‌ చేశారు. సర్‌ పేరుతో ఓటర్లను తొలగించడాన్ని ఖండిస్తూ ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట లోని 100 ఫీట్ల రోడ్డు నుంచి ఎన్‌హెచ్‌–65 వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొలగించిన ఓట్లకు బాధ్యత వహిస్తూ భారత చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, నాయకులు ప్రవీణ్‌, వినయ్‌, మహేష్‌, నవీన్‌, రాజు, పవన్‌, ప్రశాంత్‌, కిషోర్‌, భార్గవ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement