అర్జీలు త్వరగా పరిష్కరించాలి
సూర్యాపేట : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రతి కార్యాలయంలో ప్రజా వాణిలో వచ్చే దరఖాస్తుల నమోదుకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తేమ శాతం 17 రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్,డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానందరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
సాఫీగా ధాన్యం సేకరణ
జిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోందని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మంత్రులకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ధాన్యం, పత్తి , మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇందులో డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఎస్‌ఓ మోహన్ బాబు, డీసీఓ పి.ప్రవీణ్ కుమార్, జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి నివేదిత పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సీతారామారావు


