బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
హుజూర్‌నగర్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన ధూళిపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నగరంలోని బీసీ భవన్‌లో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు స్థానికంగా విలేఖరులతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఆర్ కృష్ణయ్య, ఇతర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మండల, గ్రామ స్థాయిలో బీసీల ఐక్యతకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ కమిటీ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు.


