నలభై వసంతాలకు ఒకే వేదికపైకి..
హుజూర్‌నగర్ : వారంతా పదో తరగతిలో ఒకే పాఠశాలలో చదువుకున్న స్నేహితులు.. నలభై వసంతాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వీరే గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. వీరు ఆదివారం అదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వీరంతా అప్పటి తీపి జ్ఞాపకాలను పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, పి.వీరబాబు, విజయకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎడవెల్లి వెంకటరెడ్డి, కంబాలపల్లి వెంకటనారాయణ, కడియం వెంకట్‌రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


