ఇ–కేవైసీ 72 శాతమే.. | - | Sakshi
Sakshi News home page

ఇ–కేవైసీ 72 శాతమే..

Nov 3 2025 6:18 AM | Updated on Nov 3 2025 6:18 AM

ఇ–కేవైసీ 72 శాతమే..

ఇ–కేవైసీ 72 శాతమే..

చిలుకూరు: కొందరికి రేషన్‌ కార్డులు ఉన్నా బియ్యం తీసుకోవడం లేదు. ఇలాంటి వారితోపాటు అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినంది. ఇందులో భాగంగా ప్రతి రేషన్‌ కార్డుదారుడు ఇ–కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం రేషన్‌ లబ్ధిదారులు 10.62లక్షల మందికి గాను 7.58లక్ష మందే (72 శాతమే) ఇప్పటి వరకు ఇ–కేవైసీ చేయించుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వరుసగా ఆరు నెలల పాటు రేషన్‌ బియ్యం తీసుకోని వారిని గుర్తించి వారి కోటాను తగ్గించడం లేదా లబ్ధిదారుడి కార్డును తొలగించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. రేషన్‌కార్డు గల కుటుంబంలోని వ్యక్తులు ఎవరైన చనిపోతే వారికి సంబంధించిన కోటాను తగ్గించడం లేదు. దీంతో ప్రతినెలా జిల్లాలో వందల క్వింటాళ్ల బియ్యాన్ని ఆయా కుటుంబ సభ్యులు తీసుకుంటున్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం ఇ–కేవైసీ విధానం తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇ–కేవైసీ నమోదుకు పలుసార్లు అవకాశం ఇచ్చినా అనేక మంది ఈ ప్రక్రియలో పేరు నమోదు చేయించుకోవడం లేదని అధికారులు అంటున్నారు.

ఇ–కేవైసీ తప్పనిసరి

జిల్లాలో 610 రేషన్‌షాపులు.. 3.60లక్షల కార్డులు.. 10.62లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 7.58లక్ష మందే ఇ–కేవైసీ చేయించుకున్నారు. వీరికి ప్రతినెలా 68 వేల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్‌కార్డు పొందిన కుటుంబంలోని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఇ–కేవైసీ చేయించుకోవాల్సిందేనని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. అలాగే కొత్తగా రేషన్‌కార్డులు పొందిన కుటుంబాల లబ్ధిదారులు కూడా ఇ–కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఫ కొనసాగుతున్న రేషన్‌ కార్డు

ఇ–కేవైసీ ప్రక్రియ

ఫ చేయించుకుంటేనే రేషన్‌ బియ్యం

ఫ లేదంటే కార్డు తొలగించే అవకాశం

ఫ జిల్లాలో రేషన్‌ కార్డులు 3,60,112

ఫ లబ్ధిదారులు 10,62,021 మంది

ఫ ఇ–కేవైసీ చేయించుకున్నది 7,58,712 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement