వార్డుల్లో అధికారుల పర్యవేక్షణేదీ?
వార్డు అధికారుల వివరాలు
అందుబాటులో ఉండేలా చూస్తాం
సూర్యాపేట అర్బన్ : పట్టణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన వార్డు అధికారులు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిఉన్నా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఏడాది క్రితం ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో వార్డు అధికారులను నియమించింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో విధులు చేపట్టిన వార్డు అధికారుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రతిరోజూ ఉదయం పూట చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించాల్సి ఉన్నా కేవలం వాహనాల వద్దకు వెళ్లి ఫొటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సిన కార్యక్రమం సరిగా అమలు కావడం లేదు. వార్డు కేంద్రాల్లో వార్డు ఆఫీసులు ఉండి ప్రతి ఆఫీసులో అధికారుల పేర్లు సెల్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వార్డు అధికారుల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు
వార్డు అధికారుల విధులు ఇవీ..
ఫ రోజూ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షించాలి.
ఫతడిపొడిచెత్త వేర్వేరుగా ఇచ్చేలా తెలియజెప్పాలి.
ఫ రోడ్లు, మురుగు కాలువలు, ప్రజా మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.
ఫ అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి.
ఫ మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచాలి.
ఫ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేయాలి.
ఫ వీధిదీపాలు, నీటి సరఫరాను పర్యవేక్షించాలి.
ఫ వార్డు ప్రజలకు సర్టిఫికెట్లు జారీ చేయాలి.
ఫ ఇంటి పన్నులు వసూలు చేయాలి.
ఫ వార్డు ప్రజలకు మున్సిపల్ అధికారులకు అనుసంధానంగా ఉండి సమస్యలు పరిష్కరించాలి.
ఫ వార్డు అధికారులు వార్డుల్లోనే నివాసం ఉండాలి.
మున్సిపాలిటీ మొత్తం ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లు
సూర్యాపేట 48 33 15
కోదాడ 35 25 10
హుజూర్‌నగర్ 28 08 20
తిరుమలగిరి 15 06 09
నేరేడుచర్ల 15 05 10
ఫ మున్సిపల్ కార్యాలయాలకే
పరిమితమైన సిబ్బంది
ఫ క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదని విమర్శలు
ఫ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్న దైన్యం
ఫ సమస్యలు పరిష్కరించడం
లేదంటున్న పట్టణ వాసులు
వార్డు ఆఫీసర్‌లు కొందరు గ్రూప్–1, 2 ఉద్యోగాల్లో చేరారు. దీంతో అధికారుల కొరత ఏర్పడింది. రెండు వార్డులకు ఒక ఇన్‌చార్జి ఉండడంతో పర్యవేక్షణ కొరవడింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం.
– సీహెచ్ హనుమంతరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
వార్డుల్లో అధికారుల పర్యవేక్షణేదీ?


