
గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి
మోతె : గ్రామస్థాయిలో బీజేపీని బలోపితం చేయాలని పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సిరికొండ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీతోనే గ్రామాలు అభవృద్ధి చెందుతాయన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన పలువురు కార్యకర్తలకు ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొల్లిశెట్టి కృష్ణయ్య, కనగాల నారాయణ, మన్మధరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శంకర్‌నాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి