
గోదావరి జలాలు.. దామన్న చలవే
తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం : ఆనాడు కరువు, కాటకాలతో ఎడారిగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పచ్చని పంటలు పండాలని 40 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికై న రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గోదావరి జలాలను తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఉద్యమించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఆర్డీఆర్ కృషి ఎనలేదిఅని అన్నారు. దామన్న.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసి వేలాది ఎకరాల భూములు, ఆస్తులను ప్రజలు, కార్యకర్తల కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, హత్యయత్నాలు, వివాదాలు, దాడులు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలను కాపాడి కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన ఘనత ఆర్డీఆర్‌ది అని అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటూ టైగర్ దామన్నగా గుర్తింపు పొందారని కొనియాడారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేల్‌కు చేతిలో రూ.50 వేలు లేకున్నా 50వేల మెజార్టీతో గెలవడానికి కారణం దామన్న వేసిన పునాదులేని పేర్కొన్నారు.
ఆర్డీఆర్ కృషితోనే ఎస్సారెస్పీ స్టేజ్–2..
రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీరాం సాగర్ జలాల కోసం రక్తతర్పణం చేసిన ఘనత ఆర్డీఆర్‌దే అని కొనియాడారు. దామోదర్‌రెడ్డి కృషి ఫలితంగానే ఎస్సారెస్పీ స్టేజ్–2 పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతుకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సొంత ఆస్తులను త్యాగం చేసి పార్టీని బతికించిన ఘనత దివంగత నేత ఆర్డీఆర్‌ది అని అన్నారు. దామన్న కుమారుడు సర్వోత్తంరెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ జెండాను కాపాడిన ఘనత రాంరెడ్డి సోదరులకే దక్కిందన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఆ పార్టీ శాసనసభా పక్షనేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీలను ఢీకొన్నది రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, ఎంపీ రఘువీర్‌రెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్‌రెడ్డి, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మహిళా అధ్యక్షురావు తిరుమలప్రగడ అనురాధకిషన్‌రావు, కొప్పున వేణారెడ్డి, పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్‌రావు, సంకెపల్లి కొండల్‌రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తొడుసు లింగయ్య, ఆకుల బుచ్చిబాబు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్సారెస్పీ స్టేజ్–2 కోసం 40 ఏళ్ల క్రితమే దామోదర్ రెడ్డి పోరాటం
ఫ ప్రజా జీవితంలో ఉండి ఆస్తులు త్యాగం చేశారు
ఫ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి
ఫ ఆర్డీఆర్ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఫ హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు

గోదావరి జలాలు.. దామన్న చలవే