
ఇట్టమళ్ల ఏసోబ్ మృతి పార్టీకి తీరనిలోటు
చివ్వెంల: సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ మృతి పార్టీకి తీరనిలోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. చివ్వెంల మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ కుటుంబాన్ని ఆదివారం జాన్‌వెస్లీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏసోబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏసోబ్ చేసిన కృషి, సేవలు ఎనలేనివన్నారు. చివ్వెంల మండల తొలి ఎంపీపీ ఏసోబ్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కుల నిర్మూలన కోసం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసిన ఏసోబ్ ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. బీజేపీ మతోన్మాదం, కుల తత్వాన్ని పెంచిపోషిస్తుండడం వల్లే భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి, హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్‌కుమార్ ఆత్మహత్య లాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎండీ అబ్బాస్, డీజీ నర్సింగరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టపల్లి సైదులు, కోట గోపి, కందాల శంకర్‌రెడ్డి, ఇట్టమళ్ల స్టాలిన్, దేవరకొండ యాదగిరి, రిటైర్‌డ్ తహసీల్దార్ పెరుమాళ్ల రాజారావు, బచ్చలకూరి రాంచరణ్, బొప్పాని సులేమాన్, కొల్లూరి బాబు, జానయ్య, బచ్చలి కన్నయ్య పాల్గొన్నారు.
ఏసోబ్ చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న జాన్‌వెస్లీ
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ