
సాగర్ నాలుగు గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 85,118 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను ఎత్తి 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 33,454 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 19, 348 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది.
పర్యాటకుల సందడి
సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొన్నది. ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని, ఎత్తిపోతల జలపాతాలను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ ఉన్న బౌద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. దాంతో పాటు బుద్ధవనం వద్ద కూడా పర్యాటకుల సందడి నెలకొంది.
నాలుగు గేట్ల ద్వారా విడుదలవుతున్న వరదనీరు
ఫ కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు

సాగర్ నాలుగు గేట్లు ఓపెన్