ప్రభుత్వం వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలు లేకపోవడంతో వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. ఈ వానాకాలం నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తే 5క్వింటాళ్ల పత్తి తీశాం. వరంగల్‌కు వెళ్లి అమ్మితే కేవలం క్వింటాకు రూ.5200 ధర పడింది. పత్తిని సాగు చేస్తే ఏం లాభం లేకుండా పోతోంది. పెట్టుబడులు రావడం లేదు.
– చిత్తలూరి నాగరాజు, రైతు, ఆత్మకూర్
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో 6 సీసీఐ కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు తొండరపడి దళారులు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించొద్దు. మరో 15, 20 రోజుల్లో కేంద్రాల ఏర్పాటుకు అవకాశముంది.
– సంతోష్‌కుమార్, మార్కెటింగ్ అధికారి