
పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీపుర్లతో ఊడ్చారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యాధుల కాలం కాబట్టి ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, అనారోగ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చెత్త చెదారాన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లలో పడవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నగూరి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, ఏజీపీ షఫీఉల్లా, పోలీసులు పాల్గొన్నారు.
ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో జైలు అధికారుల ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెను వివరాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలు, ఖైదీల గదులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు గుంటూరు మధు, కట్టా సుధాకర్ , జైలు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్