
హామీలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సూర్యాపేట : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ పబ్బం గడుపుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. భూభారతి చట్టం ద్వారా మొత్తం భూములను సర్వే చేసి నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగించాలని, అసలైన పట్టాదారులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వేల్పుల వెంకన్న, నరసింహారావు, మద్దెల జ్యోతి, ఉప్పుల రమేష్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జునరెడ్డి